![]() |
![]() |

బుల్లితెర మీద సౌమ్య రావు జబర్దస్త్ కి కొన్ని రోజులు యాంకరింగ్ చేసి తర్వాత షోస్ కి వస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంది. రీసెంట్ గా ఆమె ఆర్టిస్టులు గురించి కొన్ని విషయాలు చెప్పింది.
"హార్డ్ వర్క్ ఎప్పుడూ ఫెయిల్ కాదు అంటారు. కానీ హార్డ్ వర్కర్ ఐన నేను చాలా సార్లు ఫెయిల్ అయ్యాను. ఎందుకో తెలీదు. గిమ్మిక్కులు చేసే ఆర్టిస్టులంతా మంచి పొజిషన్స్ లో ఉన్నారు. ఆర్టిస్ట్ ఐతే చాలు గిన్నిస్ బుక్ ఎక్కినంత బిల్డప్ ఇస్తారు. నేను చాల సింపుల్ గా ఉంటాను. కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళు రాగానే లేవాలి, సలాం కొట్టాలి అని అనుకుంటూ ఉంటారు. ఒక్కోసారి షూటింగ్ ఐపోయాక కుదిరితే కార్ లో వెళ్తాను లేదంటే క్యాబ్ లో వెళ్తాను అస్సలు కుదర్లేదంటే ఆటోలో కూడా వెళ్తాను. కొంతమంది ఆర్టిస్టులు ఆటోలో వెళ్తావా అంటూ చెయ్యకూడని పని చేసినట్టు చూస్తూ ఉంటారు. మొత్తం సాధించినవాళ్లు ఆటిట్యూడ్ చూపించరు...అప్పుడప్పుడు ఇంతత చేసి వెళ్లిపోయే ఆర్టిస్టులకే ఆటిట్యూడ్ ఎక్కువ. ఇండస్ట్రీ నాకు ఇచ్చిన దాని కన్నా నేను పోగొట్టుకున్నది ఎక్కువ. ఈ ఇండస్ట్రీతో నేను అంత హ్యాపీగా ఐతే లేను. టాలెంట్ అక్కర్లేదు అదృష్టం ఉంటే చాలు.
జబర్దస్త్ యాంకర్ గా నన్ను తీసేసిన రోజు నేను పెద్దగా బాధపడిపోయింది ఏమీ లేదు. ఇంత వరకు అవకాశం వచ్చింది చాలు...ఇంకా అవకాశాలు వస్తాయి అనుకున్నా. ఒక్కోసారి నాకు పాకెట్ మనీకి కూడా డబ్బులు ఉండవు. నేను ఇప్పుడు ఇండిపెండెంట్ విమెన్ ని. నా డబ్బులు నేనే సంపాదించుకోవాలి. ఒక్కోసారి ఒక ఆరు నెలల వరకు అవకాశాలు ఉండవు. అప్పుడు ఉన్న కొంచెం డబ్బుతోనే సరిపెట్టుకోవాలి. నేను ఎవరినీ ఇంత వరకు డబ్బులు అడిగిందే లేదు. ఇక మీదట కూడా అలా పరిస్థితి రాకూడదు అని కోరుకుంటాను" అని చెప్పింది సౌమ్య.
![]() |
![]() |